How successful was Team India in the Virat Kohli-Ravi Shastri era?
#RaviShastri
#Teamindia
#T20WORLDCUP2021
#Bcci
#RohitSharma
#ViratKohli
రవిశాస్త్రి 4 సంవత్సరాలు టీమిండియాకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఈ సమయంలో అతను అనేక చారిత్రక విజయాలు సాధించాడు. శాస్త్రి హయాంలో భారత జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలువలేకపోయినా.. ప్రపంచ క్రికెట్‌లో బలమైన శక్తిగా ఎదిగిందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. టెస్ట్, వన్డే, టీ20ల్లో అద్భుత విజయాలు అందుకుంది. ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చేజిక్కించుకోవడం.. రెండేంళ్ల తర్వాత బలహీన జట్టుతోనే దాన్ని నిలబెట్టుకోవడం విశేషం. ఇంగ్లండ్ గడ్డపై ఒకే సిరీస్‌లో రెండు టెస్టులు నెగ్గడం.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో టీ20 సిరీస్‌లు గెలువడం ఇలా లెక్కకు మిక్కిలి విజయాలు నమోదు చేసుకుంది.